ములుగు: అనుమతులు లేవంటూ కొమురంభీం గుత్తికోయగూడెంలో పాఠశాను నిర్మాణ పనులు అడ్డుకున్న అటవీశాఖ అధికారులు
Mulug, Mulugu | Sep 14, 2025 ఏటూరునాగారం మండలం కొమరంభీం గుత్తికోయగూడెంలో నిర్మిస్తున్న పాఠశాలను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారని గ్రామస్తులు ఆదివారం తెలిపారు. గ్రామంలో సరైన పాఠశాల లేకపోవడంతో జిల్లా కలెక్టర్ చొరవతో ఇటీవల పాఠశాల మంజూరు చేశారని దీంతో నిర్మాణం చేపడుతుండగా అనుమతులు లేవంటూ అటవీశాఖ అధికారులు నిలిపివేయడంతో పాఠశాల నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు.