మాడ్గుల: మాడ్గుల మండలం ఈర్వినలో పంటపొలాల్లోకి దూసుకు వెళ్ళిన ఆర్టీసీ బస్సు.. విచారణ చేపట్టిన పోలీసులు
ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్సు పంటపోలాల్లోకి దూసుకొని వెళ్లింది. మాడ్గుల మండలం ఇర్విన్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియజేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 130 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో విద్యార్థులు కూడా ఉన్నట్లు వెల్లడించారు స్థానికులు.. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్దారించిన అధికారులు