గిద్దలూరు: కిక్కిరిసిపోయిన గిద్దలూరు, కంభం రైల్వే స్టేషన్ లు, పండగ సెలవులకు వచ్చిన వారు తిరుగు ప్రయాణం
మార్కాపురం జిల్లా గిద్దలూరు, కంభం రైల్వే స్టేషన్ లు ఆదివారం కిక్కిరిసిపోయాయి. సంక్రాంతి సందర్భంగా సెలవులకు పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన ప్రజలు తిరిగి తాము విధులు నిర్వహిస్తున్న ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో భారీగా ప్రజలు తమ ప్రాంతాలకు వెళ్లే సమయంలో రైల్వేస్టేషన్లోకి వచ్చారు. ముందస్తుగా అధికారులు కూడా రైళ్లకు అదనపు భోగిలు ఏర్పాటు చేశారు. దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా తీసుకుంటున్నారు.