కుప్పం: రామాపురం తండా సమీపంలో రోడ్డు ప్రమాదం
రామకుప్పం మండలంలోని రామాపురం తండా సమీపంలో సోమవారం బైక్‌ను మినీ టెంపో ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న చోదకుడు గాయాలపాలయ్యారు. స్థానికుల వివరాల మేరకు.. పెద్దూర్ రోడ్డు నుంచి గుటూరు తాండ ఇరవైపులా రహదారి ముళ్లకంపలు మూసుకుపోవడంతో ముందు వస్తున్న వాహనం తెలియక ఇరు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై వెళ్తున్న గోవింద నాయక్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతన్ని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.