తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకలు, విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య భౌతికంగా లేకపోయినా, ప్రతి తెలుగు వాడి గుండెలో బ్రతికే ఉన్నారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా,అన్నారు. అనంతపురం నగరంలో ఎన్టీఆర్ వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో అర్బన్ టీడీపీ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయం, జడ్పీ కార్యాలయం, ఆర్ట్స్ కళాశాల, ఏడీసీసీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.