శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండల కేంద్రంలో పసికందు అదృశ్యంపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. గత మూడు రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన రాధమ్మ, రెడ్డప్పలకు చెందిన 40 రోజుల పసికందు అదృశ్యమైందని, ఐసిడిఎస్ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలియజేశారు.