పండుకువేల ప్రకాశం జిల్లాలోని ప్రాంతాలలో బహిరంగంగా కోళ్ల పందాలు భారీగా చేతులు మారిన నగదు సోద్యం చూస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jan 14, 2026
పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రకాశం జిల్లాలో బహిరంగంగానే పండుగ వేళ జిల కోళ్ల పందాలను నిర్వహించారు. బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రజాప్రతినిధుల సహకారం తో యదేచ్ఛగా బరులను నిర్మించి కోడిపందేలను నిర్వహిస్తున్నారు. గోదావరి జిల్లాలను తలపించే విధంగా బరులను ఏర్పాటు చేసి కోళ్లకు కత్తులు కట్టి పందేలను నిర్వహిస్తున్నారు. లక్షల్లో నగదు చేతులు మారుతుంది. ఇంత జరుగుతున్న పోలీసులు ఆ వైపుగా కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.పందెం రాయుళ్ళు మాత్రం పండుగకు సరదాగా నిర్వహించుకుంటున్నారున్నారు. కోడిపందేలు పండుగ సందర్భంగా సాంప్రదాయంగా నిర్వహించుకునేటువంటి ఉత్సవాలు అని స్థానికులు చెబుతున్నారు