మునుగోడు: శివన్నగూడెం రిజర్వాయర్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పై సర్వే చేసి DPR సిద్ధం చేయాలి:MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం శివన్నగూడ రిజర్వాయర్ పనులపై సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రిటైర్డ్ ఇంజనీర్లపురం సభ్యులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్ పనులు 80% పూర్తయినప్పటికీ రిజర్వాయర్ కింద డిస్టిబ్యూషన్ నెట్వర్క్ పనులు మొదలు కాలేదని వెంటనే రిజర్వాయర్ కింద డిస్టిబ్యూషన్ నెట్వర్క్ పై సర్వే చేసి డిపిఆర్ సిద్దం చేయాలన్నారు.