రాజేంద్రనగర్: హయత్ నగర్ లో 8 ఏళ్ల బాలుడి పై వీధి కుక్కలు దాడి
హయత్నగర్లోని శివగంగ కాలనీలో 8 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా GHMC నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. నగరంలో పెరుగుతున్న కుక్కల దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ వీధి కుక్కల దాడులు జరిగినా.. క్షేత్రస్థాయిలో పర్య వేక్షణ మరిచారని, ఇకనైనా కుక్కలు గుంపులుగా తిరిగే వీధుల్లో ప్రత్యేక చొరవ చూపాలని కోరుతున్నారు.