గుమ్మలక్ష్మీపురంలో ఘనంగా గిరిజనుల కందికొత్తలు సంబరాలు, పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే
పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గిరిజన సాంప్రదాయ కంది కొత్తల పండుగ ఆదివారం మద్యాహ్నం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. మొదటగా గొడ్డలమ్మ, జాకారమ్మలను దర్శించుకుని అనంతరం గిరిజనులతో కలిసి డప్పు కొడుతూ దింసా నృత్యం చేసారు. భవిష్యత్తులో కందికొత్తల ఉత్సవాలను ప్రభుత్వమే జరిపించి గిరిజన ఆచారాలు,సాంప్రదాయలు అంతరించిపోకుండా చర్యలు చేపడతామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు.