సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ డిమాండ్ తో డిసెంబర్ 10న చలో ఢిల్లీ : బిసి జఏసి చైర్మన్ ప్రభు గౌడ్
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 10న 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు బీసీ జిల్లా జేఏసీ ఛైర్మన్ ప్రభు గౌడ్ తెలిపారు. సోమవారం సంగారెడ్డిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పించాలని లేనియెడల ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు పాల్గొన్నారు.