భిక్కనూర్: భిక్కనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇఎన్టి వైద్య శిబిరం
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం స్వస్థ్ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు బికనూరు మండల వైద్యాధికారిని డాక్టర్ హెమియా తెలిపారు.ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ రెహనా ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.