పోస్టల్ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఖాతాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఆ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. జనంలోకి మనం కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం పట్టణంలో పోస్టల్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం హెడ్ పోస్టాఫీసు ఆవరణలో ప్రత్యేక మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 సంవత్సరాల లోపు బాలికలకు సుకన్య సమృద్ది ఖాతా, మహిళల కోసం మహిళా సమ్మాన్ ఖాతాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని, వీటని వినియోగించుకోవాలని కోరారు.