కనిగిరి: ఆటో బోల్తా పడి ఒకరు మృతిచెందగా ముగ్గురికి గాయాలైన సంఘటన మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని టకారి పాలెం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పొదిలి వైపు నుండి కనిగిరి కి వస్తున్నా ఎలక్ట్రికల్ ఆటో వేగంగా వస్తూ టకారి పాలెం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కనిగిరి పట్టణంలోని పాతూరుకు చెందిన మిసనం కోటేశ్వరరావు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలు కాగా వారు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.