రైతులకు యూరియా పంపిణీ చేసిన వాకాడు సొసైటీ డైరెక్టర్ తిరుమూరు వెంకటకృష్ణ రెడ్డి
Gudur, Tirupati | Nov 18, 2025 వాకాడు మండలం జెమిని కొత్తపాలెం సచివాలయ పరిధిలోని గంగన్నపాలెంలో టీడీపీ నాయకులు, వాకాడు సొసైటీ డైరెక్టర్ తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి చేతులమీదగా రైతులకు యూరియా పంపిణీ చేశారు. వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని, సబ్సిడీ రేటుకి యూరియా అందేల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు దీనిని సద్వినియోగంచేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సురేశ్ ఉన్నారు.