మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల్ల అడవి ప్రాంతంలోని పాలుట్లకు రావడానికి తమకు మూడు గంటల సమయం పట్టిందని ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థలను స్వయంగా చూసామన్నారు. టైగర్ రిజర్వాయర్ ఫారెస్ట్ కావడంతో రహదారి నిర్మాణానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చిస్తామన్నారు.