భిక్కనూర్: స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి బిక్కనూర్లో బిక్కనూరు ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల ఎంపీడీవో రాజు కిరణ్ రెడ్డి చెప్పారు. శుక్రవారం బిక్కనూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా వనరుల అధికారి రాజా గంగారెడ్డి, మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.