పురాతన విగ్రహాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు
తిరుపతి జిల్లా ఓజిలి మండలం కొండవల్లిపాడు గ్రామంలో బయటపడ్డ పురాతన విగ్రహాల విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆదివారం పరిశీలించారు. పొలం యజమానితో మాట్లాడారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కొందరు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతన విగ్రహాల విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు ఆ విగ్రహాలను పరిశీలించి మండల తహసిల్దార్ కు సమాచారం ఇచ్చారు తదుపరి చర్యల నిమిత్తం ఏర్పాట్లను చేపట్టారు.