కామారెడ్డి: బిబిపేటలోని ఆరోగ్య కేంద్రంలో పౌష్టిక ఆహారంపై అవగాహన
కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో బుధవారం పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్య పర్యవేక్షణ అధికారి ప్రభావతి మాట్లాడుతూ... గర్భిణీలో చిన్న పిల్లల తల్లులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషక విలువల గురించి తెలిపారు. విటమిన్లు గల ఆహార పదార్థాల గురించి వివరించారు. ఆరోగ్య సంరక్షణకు పోషక ఆహారం చాలా ముఖ్యమని తెలిపారు.. కార్యక్రమంలో పిహెచ్ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.