ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించి పరిశీలించారు.అర్జీలను ఎమ్మెల్యే తక్షణమే పరిష్కరించగా మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిశీలించే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.