అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నెలగొండ గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని సర్పంచ్ భాగ్యమ్మ ఆరోపించారు. ఆదివారం గ్రామంలో నెలకొన్న సమస్యలకు సంబంధించిన వీడియోలను సర్పంచ్ భాగ్యమ్మ విలేకరులకు విడుదల చేశారు. సర్పంచ్ భాగ్యమ్మ గ్రామంలోని మురికి కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని అన్నారు. గ్రామ పంచాయతీలో అనేక సమస్యలు ఉన్నాయని ఎంతమంది అధికారులకు విన్నవించిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. మండల సర్వసభ సమావేశంలో ఎంపీడీఓ వారంలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారన్నారు.