నేలకొండపల్లి: ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ వద్ద రోడ్డు ప్రమాదం
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పొన్నేకల్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది....బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.