శ్రీకాకుళం: విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపారంటూ ఆందోళన చేసే అర్హత వైసీపీ నాయకులకు లేదు : ఎమ్మెల్యే శంకర్
విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపారంటూ ఆందోళన చేసే అర్హత వైకాపా నాయకులకు లేదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు.శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గోండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి నేటి వరకు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని అన్నారు.వైకాపా పాలనలో అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడిన అవినీతి పరులంతా రాష్ట్ర ఖజానాకు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తోందని అన్నారు.