కపిలేశ్వరపురం లో గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు, పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ హరీష్
కపిలేశ్వరపురం లో స్వర్గీయ గన్నమని ఆనందరావు శత జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గన్నమని ఆనందరావు కుటుంబ సభ్యులు తమ సహకారంతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్, కమ్యూనిటీ హాస్పిటల్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాబ్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాధవ్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఇతర నాయకులు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.