గొంతు నొప్పితో బాధపడుతున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి
Anantapur Urban, Anantapur | Mar 29, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్న సికేపల్లి మండలం న్యామద్దల గ్రామానికి చెందిన గోనిపెంట నాగభూషణ అనే వ్యక్తి గొంతు నొప్పితో బాధపడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.