రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవం ఈరోజు వర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. తెలంగాణ, ఝార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, PJTSAU కులపతి C. P. రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరిగింది. దేశానికి వ్యవసాయ రంగం కీలకమని, మానవ మనుగడకి వ్యవసాయమే ప్రధాన ఆధారమని ఆయన తెలిపారు