కట్టంగూర్: కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేస్తుంది:మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాలను మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ విద్యార్థులు సరైన వసతులు లేమి కారణంగా అవస్థలు పడుతున్నారని ప్రత్యక్షంగా చూసామన్నారు. తాగునీరు వసతి గృహాలు మరుగుదొడ్లు భోజన సదుపాయాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు తగిన స్థాయిలో లేవని విద్యార్థులు తమ సమస్యలను వివరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు.