ఏపి గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో విఆర్ఎలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ బందరు కలెక్టరెట్ వద్ద దర్నా
Machilipatnam South, Krishna | Sep 22, 2025
ఏపి గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో విఆర్ఎలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ స్తానిక మచిలీపట్నం కలెక్టరేట్ వద్దనున్న ధర్నా చౌక్లో సోమవారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా గ్రామ రెవిన్యూ సహాయకులు సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు. గ్రామ రెవిన్యూ సహాయకులు (విఆర్ఎలు) ప్రస్తుతం గౌరవ వేతనం కేవలం రూ 11 వేలు మాత్రమే అందుతుందన్నారు.