ప్రకాశం జిల్లా చీమకుర్తిలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు గురువారం రాత్రి క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఎన్ఎస్పీ కాలనీ నుంచి సూర్య నగర్ వరకు కొనసాగింది. జీసస్ బోధించిన బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలంటూ ర్యాలీ నిర్వహించారు. పాస్టర్స్ క్రీస్తు బోధనలు వినిపించారు.