పెద్దపప్పూరు మండలం అశ్వర్థ క్షేత్రంలో వెలసి ఉన్న అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం శర్మ చెప్పారు. అశ్వర్థ నారాయణస్వామి దేవాలయం వద్ద ఆయన మంగళవారం మాట్లాడారు. ఈనెల 25, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 15 తేదీలలో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ తరలివచ్చి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.