శ్రీశైలం డ్యాం దిగువన ఎలాంటి నూతన దర్గా నిర్మాణం అనేది అవాస్తవం
Nandyal Urban, Nandyal | Feb 3, 2026
శ్రీశైలం డ్యాం దిగువన లింగాలగట్టు వద్ద నూతన దర్గా నిర్మాణం జరుగుతున్నది అవాస్తవం అని మంగళవారం గ్రామ ప్రజలు, అధికారులు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పాతాళగంగ వద్ద నూతన దర్గా నిర్మాణం చేపడుతున్నట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.దీంతో ఈనెల 14న చలో శ్రీశైలానికి హిందూ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా అధికారుల ఆదేశాలతో తహశీల్దార్ శ్రీనివాసులు, సీఐ సుబ్బారావు క్షేత్రస్థాయిలో విచారించారు.