వికారాబాద్: రజకుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి - తెలంగాణ రజక సంఘాల జేఏసీ అధ్యక్షులు పంచగుల ఆంజనేయులు
రజకుల అభివృద్ధికి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు అందించాలని తెలంగాణ రజక సంఘం జేఏసీ అధ్యక్షులు పంజాగుట్ట ఆంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ హాల్లో జిల్లా రజక సంఘాల జేఏసీ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో రజక సంఘాల కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో రజకులకు పెద్దపీట వేయాలని ఎంతోమంది పేద రజకులు ఉన్నారని అన్నారు.