శ్రీకాకుళం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి పోకుండా చర్యలు చేపట్టాలి: జే.సీ. పర్మాన్ అహ్మద్ ఖాన్
దాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి పోకుండా చూడాలని, అలాగే అవసరమైన రైతులకు టార్పాలిన్ లు, టెంట్లు, గోనే సంచులు, ఇతర వసతులను అందుబాటులో ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు.గురువారం సాయంత్రం జిల్లాలో గల పలు మండలాల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో అన్ని దాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకొవాలని, వచ్చిన ధాన్యం వచ్చినట్టు సేకరించాలని ఆదేశించారు.