నెహ్రు నగర్ గ్రామంలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ లో 62 లక్షల చేప పిల్లలను విడుదల చేసిన, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంనెహ్రూనగర్ గ్రామంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ గోకరాజు కుంట దగ్గర మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి,చేపల ఉత్పత్తిని పెంచడానికి 62 లక్షల చేప పిల్లలను బుధవారం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య మత్స్యశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మత్సకార సహకార సంఘాలకు చేప పిల్లలను సరఫరా చేసిందన్నారు. దీనివల్ల మండలంలోని చెరువుల్లో చేపల ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు.ఈ చేప పిల్లల విడుదల వల్ల మత్స్యకారుల సహకార సంఘాల్లోని కుటుంబాల జీవనోపాధిమెరుగుపడుతుందన్నారు,మత్స్యకారులకు స్థిరమైన ఆదాయం అందించేం