వైద్య విద్యార్థులకు బాధ్యతాయుతమైనది వైద్య వృత్తి: కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Nov 18, 2025
అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ వద్దనున్న మెడికల్ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 2025 సంవత్సరం వైద్య విద్యార్థుల ప్రెషర్స్ డే అత్యంత సందడిగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం అనంతపురం వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వైద్యవృత్తి అత్యంత విలువైనదని, టెక్నాలజీ అత్యంత వేగంగా మారుతున్న ఈ కాలంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నైపుణ్యలైన వైద్యులుగా తయారు కావాలని పిలుపునిచ్చారు. వైద్య వృత్తిలో ఉన్నత స్థానాలకు చేరుకొని కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.