కామేపల్లి: కామేపల్లి లో సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాలాభిషేకం
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలోని ఇల్లెందు నియోజకవర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య ఆధ్వర్యంలో సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ చేవెళ్లలో నిర్వహించిన సభలో గ్యాస్ 500 రూపాయలు విద్యుత్తు 2 యూనిట్లు ఫ్రీగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు