ముధోల్: బాసర మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న శారదా బేకరీలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.
Mudhole, Nirmal | Sep 21, 2025 నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న శారదా బేకరీలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. దొంగలు సీసీ కెమెరా, డీవీఆర్‌ను ధ్వంసం చేశారు. దుకాణ యజమాని దశరథ్ పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలో షార్ట్ సర్క్యూట్‌తో నష్టపోయిన తనకు మళ్లీ చోరీ జరగడం బాధాకరమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు