మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో కుసుమ హరినాధ 81వ ఆనందమేలోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో లీల కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. ఆధ్యాత్మిక మార్గంలో మానసిక ప్రశాంతత కలుగుతుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కుసుమహరనాథ భక్తి మండలి సభ్యులు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.