మేడ్చల్: కూకట్పల్లిలో వెంకట్ రెడ్డి అరెస్టును ఖండించిన పార్టీ అధికార ప్రతినిధి శ్యామల
ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న వెంకటరెడ్డిని ఎలాంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా తాడిపత్రి పోలీసులు సివిల్ డ్రెస్సులో తీసుకెళ్లారని వైఎస్ఆర్సిపి నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, వెంకటరెడ్డి భార్య హరిత, ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డితో కలిసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెడ్ బుక్ వ్యవహారంపై టార్గెట్ చేసి అరెస్టు చేశారన్నారు.