కార్పొరేట్ శక్తుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేసిన గుడివాడ CPM పట్టణ కార్యదర్శి RCP రెడ్డి
Machilipatnam South, Krishna | Sep 21, 2025
కార్పొరేట్ శక్తుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి: సీపీఎం పట్టణ కార్యదర్శి స్తానిక గుడివాడలో CPM పట్టణ కార్యదర్శి RCP రెడ్డి ఆదివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో మిడియా ముఖంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నిర్వీర్యం చేశాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాకపని సమయాన్ని 8 నుంచి 10 గంటలకు పెంచడం సిగ్గుచేటన్నారు. పని సమయాన్ని పెంచి కార్మికుల శ్రమను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ప్రభుత్వాలు సిద్ధమయ్యాయన్నారు.