ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎల్లారెడ్డి పాలెం గ్రామంలో నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నీటి వసతి లేక తప్పని పరిస్థితులలో అందరం కలిసి ట్యాంకర్లు కొనుగోలు చేసి నీటిని పట్టుకుంటున్నామన్నారు. అయితే ఆ నీరు ఎవరికీ సరిపోవటం లేదని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి నీటి సమస్య లేకుండా శాశ్విత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.