జిల్లా అభివృద్ధి పథంలో నడిచేందుకు కావలసిన పూర్తి సహాయ సహకారాన్ని తాను అందిస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 'దిశ' సమావేశం పూర్తయిన అనంతరం ఎంపీ మాట్లాడారు. జిల్లాకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సైతం త్వరితగతిన అందేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా అందరి సహకారంతో ముందుకు సాగుతామన్నారు.