గుంతకల్లు: గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో ప్రమాదవశాత్తు మిద్దె మెట్ల మీద నుంచి జారి కింద పడి జయమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు
గుత్తి లోని తాడిపత్రి రోడ్డులో నివాసం ఉండే జయమ్మ అనే మహిళ ప్రమాదవశాత్తు విద్య మెట్ల మీద నుంచి జారి కిందపడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. జయమ్మ మిద్దె పైనుంచి దిగుతున్న సమయంలో మెట్ల మీద నుంచి జారి కింద పడింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జయమ్మ తలకు వైద్యులు ఆరు కుట్లు వేశారు. అబ్జర్వేషన్ లో ఉండాలని జయమ్మకు వైద్యులు సూచించారు.