గుమ్మగట్ట మండలం అడిగుప్ప లో కోడి, గుడ్డు, మద్యం ముట్టరు 400 ఏళ్ల క్రితం పాళేగాడు రాజులయ్య రాజుగా ఉండేవాడు. రాజు రాయదుర్గం వెళ్లగా చిత్రదుర్గం రాజు శత్రుసైనికులకు మద్యం, కోడిమాంసం రుచి చూపించి మత్తులో ముంచి.. కోటలోని ధన రాసులను తీసుకెళ్ళేందుకు ఉపక్రమించాడు. రాజు అడిగుప్పకు చేరుకుని బుడిగే ఆ సైన్యాన్ని చంపి కొండ వద్ద పాతిపెట్టారు. మద్యం, మాంసం ముట్టబోమని ఆ ఊరి వారందరితో రాజు ప్రమాణాలు చేయిస్తారు. అప్పటినుంచి ఆ గ్రామంలో ఈ ఆచారం అమల్లోకి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.