భీమిలి: అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం చిల్లర వర్తకులు, స్ట్రీట్ వెండర్లున్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలో పాల్గొనకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఉందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు ని, ఏరియా పార్టీ కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ లను ఇళ్ల వద్దనే ముందస్తుగా అరెస్ట్ చెయ్యాడాన్ని విరిద్దరూ తీవ్రంగా ఖండించారు. 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ చార్జీలు రద్దు చెయ్యాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులపై అన్యాయంగా కాల్పులు జరిపి నలుగురుని పొట్టన పెట్టుకున్నరన్నారు.