జీఓ నెంబర్ 2 వర్తింపజేయాలని గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇచ్చిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు
జీఓ నంబర్ 2 వర్తింపజేయాలని విద్యాశాఖ లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరికి గుమ్మలక్ష్మీపురంలో మద్యాహ్నం వినతి పత్రాన్ని అందించారు. ప్రభుత్వం నిన్న రిలీజ్ చేసిన జీవో 2 లో మా ఉద్యోగులకు కూడా ఎంటీఎస్ వర్తింపు చేయాలని కోరుతున్నామన్నారు. పై విషయాన్ని సిఎం మరియు విద్యశాఖ మంత్రికి దృష్టికి తీసుకు వెల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జియ్యమ్మవలస మండల విద్యాశాఖ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.