భీమిలి: చిరువర్తకులను ఆర్థికంగా నష్టపరిచి. మానసికంగా కృంగదీశారు. సిఐటీయు.
తోపుడు బండ్లు చిరు వ్యాపారులను ఆర్థికంగా నష్టపరిచినవి కాకుండా మానసికంగా తీవ్రమైన వేదనకు గురిచేసారని వాపోయారు. సోమవారం మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద వీధి విక్రయదారులు భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా చిరు వర్తకులు మాట్లాడుతూ బ్రతుకుల్ని మా కుటుంబాలను కాపాడ వలసిన కూటమి పాలకులు, తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మనుషులుగా కూడా మమ్మల్ని చూడలేదని అన్నారు. కరుడుగట్టిన నేరస్తుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో అలా చేశారని తెలిపారు. మాకున్న చట్టాలను అధికారులు, కూటమి పాలకులు అమలు చెయలేదని కనీసం వాటిని గౌరవించ లేదని అన్నారు.