ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని వెంకటేశ్వర కాలనీ పరిసర ప్రాంతాలలోని ప్రైవేటు వెంచర్లలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కోలాట ప్రదర్శన పలువురు తిలకించారు పండుగ సందర్భంగా కుటుంబాలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలలో భాగంగా కోలాటం జానపద మరియు సాంఘికపరమైనటువంటి కార్యక్రమాలతో పాటు చిన్నారుల డ్యాన్స్ అభినయ కార్యక్రమాలు కూడా స్థానికులను అలరించాయి. పండుగ సందర్భంగా దేశ విదేశాలనుంచి మరియు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి స్థానిక కుటుంబాలకు సంబంధించిన ప్రజలు ఆయా కార్యక్రమాలలో పాల్గొని ఆనందంగా పండుగను గడిపారు