అపాయంలో ఉన్న చిన్నారి వైద్యంకు ఆపన్న హస్తం అందించిన చిరంజీవి సేవా సంఘం సభ్యులు
తిరుపతి జిల్లా నాయుడుపేట చెందిన చిన్నారి వైద్యంకు అత్యవసరంగా నాలుగు యూనిట్లు B+(SDP)రక్తదాతలు అవసరమని తెలిసిన వెంటనే స్పందించి చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మాభాష B+(SDP)రక్తదాతలను మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది, వారితోపాటు సూళ్లూరుపేట నుండి వేలూరులోని రాణిపేట క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు వెళ్లి చిరంజీవి సేవా సంఘం సభ్యులు మాబాషా, చైతన్య, ప్రవీణ్, శివ, రక్తదానం చేశారు. అవసరానికి అనుగుణంగా చిన్నారి ప్రాణాలు కాపాడటం కోసం సకాలంలో వైద్యం అందేలా మెగా స్టార్ చిరంజీవి స్ఫూర్తితో సహకరించిన చిరంజీవి సేవా సంఘం వారు ఎంతో అభినందనీయులని పలువురు కొనియాడారు.