అనంతపురం జిల్లా గుమ్మగట్ట సమీపాన బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ద్విచక్ర వాహనం ఢీకొన్న గుర్తుతెలియని వాహనం. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న సిద్దేశ్వర అనే వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాయదుర్గం నుండి గుండ్లపల్లికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా గుమ్మగట్ట సమీపాన ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.